- ఎంసెట్,జేఈఈ & నీట్ లో శిక్షణ: కడియం శ్రీహరి
[స్వేచ్ఛ న్యూస్ ] హైదరాబాద్ జనవరి 03 : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా వ్యాపా రాన్ని తగ్గించి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలన్నారు. . ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు పెరగడానికి లెక్చరర్ల కృషే ప్రధాన కారణమన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం నేతలు పాల్గొన్నారు.