మేడారంను జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

హైదరాబాద్‌: తెలంగాణాలో అతి పెద్ద మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. రాష్ట్ర ఎంపీలతో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్‌ ఓరమ్‌ను కలవనున్నారు. కోట్లాది మంది దర్శించే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *