నార్కట్పల్లి:మనస్తాపంతో మహిళా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామంలో చోటుచేసుకుంది.నార్కట్పల్లి ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన దామెర లక్ష్మమ్మ w/o వెంకన్న వీరికి సుమారు 14 సంవత్సరాల క్ర్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.5 -6 సంవత్సరాల నుండి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. విసుగు చెందిన భార్య సోమవారం భర్త ప్రవర్తన మార్చుకోవాలి అని అడిగినందుకు వీరి మధ్యలో గొడవ జరిగింది.తీవ్రమనస్తాపంకి గురైన లక్ష్మమ్మ ఇంట్లోనే ఉన్న కిరొసిన్ తో ఆత్మహత్యకు పాల్పడింది .చుట్టూ పక్కనవాళ్లు చూసి అంబులెన్సులో నల్గొండ లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందింది.లక్ష్మమ్మ సోదరుడు ఐతరాజు లింగస్వామి s /o పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.