నార్కెట్ పల్లి లో గుట్కాలు పట్టుకున్న పోలీసులు

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 3, నార్కెట్ పల్లి: అక్రమంగా గుట్కాలు నిల్వచేసి వ్యాపారం చేస్తున్న షాపు పై దాడి చేసి నిషేధిత గుట్కాలను సీజ్ చేసి నిందితుడిపై నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కెట్పల్లి మండల కేంద్రానికి చెందిన కందగట్ల రామకృష్ణ ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు (మీరాజ్ తంబాకు, ఎస్ ఆర్-1) గ్రామంలో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ ఐ సిబ్బందితో కలిసి దాడి చేసి ఇంట్లో సోదాలు చేయగా 1)మిరాజ్ తంబాకు 05 బ్యాగులు (ఒక్క బ్యాగులో లో 35 పెద్ద ప్యాకెట్ల , ఒక్క పెద్ద ప్యాకెట్లో 15 చిన్న ప్యాకెట్లు ) , 2)SR-1 14 ప్యాకెట్లు (ఒక్క దానిలో 70 చిన్న ప్యాకెట్లు) గుర్తించారు. సుమారుగా 36,500 విలువ గల సరుకు ఉంటుందని అంచనా షాపు నిర్వాహకులు కందగట్ల రామకృష్ణ, కందగట్ల నాగలక్ష్మి ఇద్దరు పొగాకు, గుట్కా ఉత్పత్తులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యలకు హాని తల పెడుతుండడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన వస్తువులు విక్రయించినట్లయితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఎవరినైనా చట్టరీత్యా శిక్షించనున్నట్లు తెలిపారు. గుట్కాలు మాదక ద్రవ్యాలు తదితర మత్తుపదార్థాలను సేవించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నార్కట్ పల్లి లో గతంలో ఎన్నోసార్లు నిషేధిత వస్తువులు అమ్మినవారి పై కేసులు నమోదు చేసినా కూడా ఇప్పటికీ మార్పు రాకపోవడంపై మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వారికి పెద్దల అండదండలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విక్రయదారుల పై కఠిన చర్యలు తీసుకోనందువల్లనే వాళ్లు భయపడకుండా వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *