స్వేచ్ఛ న్యూస్, మార్చ్ 19, నార్కెట్ పల్లి: చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నంది సర్కిల్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు నార్కెట్ పల్లి ఎస్ ఐ రామకృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు గత నెల రోజులుగా దేవస్థానం పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న మహిళ (60) శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పరిశీలించి చూడగా మృతి చెందినట్టు గమనించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ ఉండేదని పరిసర ప్రాంత వ్యాపారులతో తనకు బంధువులు ఎవరూ లేరని తరచూ చెబుతూ ఉండేదని స్థానికులు తెలిపారు. మృతురాలు ఆకుపచ్చని చీర జాకెట్ ధరించి ఉన్నదని మృతురాలిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో 9440795635 నెంబరుకు సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి జూనియర్ అసిస్టెంట్ రేగట్టే రవీంధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.