స్వేచ్ఛ న్యూస్, మార్చ్ 19, నార్కెట్ పల్లి: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన శనివారం నార్కెట్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన చిరుమర్తి లక్ష్మమ్మ (70) నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు నార్కట్ పల్లి కి వచ్చి సరుకుల కొనుగోలు అనంతరం తిరుగు ప్రయాణంలో తన సొంత గ్రామానికి వెళ్లే క్రమంలో గ్రామానికి వెళ్లే ఆటోలు నిలిచి ఉండే ప్రాంతానికి మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో రోడ్డు పక్కనుంచి నడిచి వెళుతుండగా వెనకనుంచి AP 29 TA 6165 నెంబరు గల లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ లక్ష్మమ్మ ను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల ప్రజలు 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతురాలి బంధువు దుబ్బ రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.