కె.సి. ఆర్. నాయకత్వంలోనే దేవాలయాలకు పూర్వ వైభవం

స్వేచ్ఛ న్యూస్, వేములపల్లి, 19-03-2022. తెలంగాణ పార్టీ నాయకత్వంలోనే దేవాలయాలకు పూర్తి వైభవం వస్తుందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తెలియజేశారు. శుక్రవారం మండలంలోని అమనగల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో రాష్ట్రం లోని అన్ని దేవాలయాలకు పూర్తి వైభవం వచ్చిందని అన్నారు .దేవాలయా లు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా అలనాటి కాకతీయుల కాలం నాటి కట్టడాలు ఎంతో ప్రసిద్ధి చెందిన వారని పేర్కొన్నారు. ఇవి పూర్వ వైభవం కలలను సంప్రదాయాలను ముందు తరాల వారికి అందించేందుకు ప్రతి నిలుస్తున్నాయి అని తెలియజేశారు. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ కోలాట ప్రదర్శనలు గెలుపొందిన విజేతలకు N.బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల బో తుసిద్ధార్థ తో కలిసి బహుమతులు ప్రధానం అందజేశారు. కార్యక్రమంలో నా మీ రెడ్డి కర్ణాకర్ రెడ్డి బాబయ్య బిత్తిరి సత్తి జబర్దస్త్ టీం టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *