నార్కెట్పల్లి లోని జిందాల్ కంపెనీ లో నీటిలో మునిగి కార్మికుడు మృతి

స్వచ్ఛ న్యూస్, మార్చి 20, నార్కెట్ పల్లి: నార్కెట్ పల్లి మండలం లోని జిందాల్ (ustpl) కంపెనీ లో నీటిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్కండ్ రాష్ట్రానికి చెందిన బోలా (42) స్థానిక జిందాల్ స్టీల్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. హోలీ పండుగ సందర్భంగా ముగ్గురు మిత్రులు మద్యం సేవించి ఇంటికి వెళ్లే క్రమంలో కంపెనీలో ఉన్న నీటి సంపులో బోలా పడిపోయాడు. అది గమనించని మిగతా ఇద్దరూ సాయంత్రం వరకు బోలా ఇంటికి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా బోలా ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం కంపెనీ వాచ్ మెన్ సాధారణ తనిఖీలలో భాగంగా తనిఖీ చేస్తుండగా కంపెనీలోని వాటర్ సంపులో వ్యక్తి మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి చూడగా హోలీ పండుగ రోజు తప్పిపోయిన బోలా దిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నార్కెట్ పల్లి ఎస్ఐ బి రామకృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *