ఎల్బీ నగర్, 26-4-2022, స్వేచ్ఛ న్యూస్:
ఎల్బీనగర్ పరిధిలోని గడ్డి అన్నారంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి,మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ కిషన్ రెడ్డి, శ్రీ జైపాల్ యాదవ్, కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.21.36 ఎకరాల్లో జీ ప్లస్ 14 అంతస్తుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు.300ఐసీయూ బెడ్స్,16 ఆపరేషన్ థియేటర్లు ఉండేలా ఆస్పత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రూ.900 కోట్లు కేటాయించారు.