అక్రమ అరెస్ట్ తో ఉద్యమాన్ని ఆపలేరు..చందు నాయక్



దేవరకొండ,27-4-2022, స్వేచ్ఛ న్యూస్:

తెరాస ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు వెంటనే ఫ్లీనరిలోనే ప్రకటించాలి.లేకుంటే,ఇచ్చిన నోటిఫికేషన్ని తక్షణమే రద్దు చేసి, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని సేవాలాల్ బంజారా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ చందు నాయక్ తెలిపారు.ప్రభుత్వం గులాబీ గూటిలో ఉంది అన్ని పోలీసులు వారి పక్షాన్న ఉన్నారని తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకు పోలీసులు అక్రమ అరెస్టు చేయడం దారుణం అన్నారు.ఈ అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని,రిజర్వేషన్లు కల్పించే వరకు మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ఈ సంధర్భంగా తెలియజేశారు. అరెస్టులో LHPS రాజు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చందు నాయక్ సేవలాల్ బంజారా సాంగం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకుడు, కోర్ర పాండు నాయక్, బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు, కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *