ఆస్తుల కన్నా ఆప్తులను సంపాదించిన రామన్న యాదవ్

స్వేచ్ఛ న్యూస్, మే16, నల్లగొండ: దశాబ్దకాలం రాజకీయాలలో ఉండి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసి నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అహర్నిశలు పరిశ్రమించి ఆస్తుల కన్నా ఆప్తులను సంపాదించిన నిజమైన ఆదర్శ నాయకుడు ఆవుల రామన్న యాదవ్ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా రామన్న యాదవ్ చేసిన పోరాటాలను సభికులు స్మరించుకున్నారు. అన్నా అంటే నేనున్నానంటూ పలికే రామన్న యాదవ్ లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రామన్న యాదవ్ సంతాప సభలో పాల్గొన్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, గొర్రెలు మేకల పెంపకం దారుల సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లు రామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ లక్ష రూపాయల ఆర్థిక సహాయం తో పాటు రామన్న సతీమణి సుజాతకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గాదరి కిషోర్ కుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ లు 50 వేల చొప్పున ఆర్థిక సహాయం తో పాటు భవిష్యత్తులో కుటుంబ అవసరాలకు సహకారాన్ని అందించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా యాదవ సంఘం, యాదవ ఉద్యోగుల సంఘం 3 లక్షల 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వట్టే జానయ్య ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పెరిక కరణ్ రాజు 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సీఐ ఏడుకొండలు మాట్లాడుతూ రామన్న యాదవ్ చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని కన్నీటిపర్యంతమయ్యారు. రామన్న పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

మానవత్వం చాటుకున్న చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం: దశాబ్ద కాలం పాటు చేసిన స్నేహానికి నిజమైన నిదర్శనం గా నిలిచారు హైదరాబాద్ కు చెందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబ సభ్యులు. గుండెపోటుతో అకాల మరణం చెందిన రామన్న యాదవ్ కుటుంబానికి అన్ని రకాలుగా బాసటగా నిలుస్తూ తమ కుటుంబంలో సభ్యునిగా భావించి రామన్న కుటుంబానికి ఆర్ధిక తోడ్పాటు తో పాటు నైతిక స్థైర్యాన్ని కల్పించిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబ సభ్యులు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ లను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సంతాప సభ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, సి ఐ ఏడుకొండలు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, పిళ్లి రామరాజు,బోనగిరి దేవేందర్, ఇడేమ్ కైలాస్, చీర పంకజ్ యాదవ్, బొబ్బలి గోపాలకృష్ణ యాదవ్, తరాల పరమేష్ యాదవ్, రావుల శ్రీనివాస్రెడ్డి, కన్నెబోయిన సైదులు యాదవ్, తిరుమల రాము, సిలిగిరి సురేష్ రెడ్డి, అల్లి వేణు, అల్లి సుభాష్, సోమనబోయిన సుధాకర్, ఈరటి బాలరాజ్, కందుల మధు, మెట్టు మనోహర్, నవీన్, రుద్ర వెంకట్, నిరసన మెట్ల నాగార్జున, బల్లెం ప్రవీణ్ కుమార్, మాతంగి అమర్, పోలబోయిన శ్రీనివాస్, బండారు సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *