టి.ఆర్.ఎస్. ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో అన్ని గ్రామాల లో అభివృద్ధి

స్వేచ్ఛ న్యూస్, వేములపల్లి: 17-05-2022. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి-షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వేసవికాలంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పక్క రాష్ట్రంలో చూచినప్పుడు 24 గంటలలో 7’8’9’గంటలు మాత్రమే కరెంటు ఇచ్చినట్టుగా తెలుస్తుందన్నారు. కరెంటు కోత వలన పక్క రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు కొరత ఉండకూడదని మన నియోజకవర్గమైన దామరచర్ల లో 4000 మెగావాట్ల విద్యుత్తు తయారయ్యేందుకు దశలవారీగా నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా చెక్ డ్యామ్ నిర్మాణము గ్రామీణ ప్రాంతంలో ప్రతి కాలనీలో సిసి రోడ్ల నిర్మాణం మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా విద్యను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వ్యాధులకు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ త్వరలో కీళ్లమార్పిడి ఈ విధానాన్ని కూడా అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు. దశలవారీగా దళిత బంధు సొంత ఇంటి కల నిర్మాణం కోసం అర్హులైన వారికి ఇంటి ఒక్కంటికి మూడు లక్షల రూపాయల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ జడ్పి కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ ఎమ్మార్వో లు వెంకటేశం అర్చన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *