27-5-2022, స్వేచ్ఛ న్యూస్:
దేవరకొండ పట్నం హనుమాన్ నగర్ లో గ్రామస్తులతో పులిజాల రమేష్ ఇండ్ల తో పాటు మరో రెండు ఇళ్లలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. సునీత ఇంట్లో 20వేల నగదు 20 తులాల వెండి పావులఎత్తు బంగారం పోయినట్లు తెలిపారు. మిగతా ఇళ్లలో బీరువాలు తెరిచి బట్టలు వస్తువులను చిందరవందర అందజేశారు. నాలుగేళ్లలో యజమానులు లేకపోవడంతో దొంగలు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. పట్టణంలోని నడిబొడ్డున జరిగిన ఈ దొంగతనం పట్ల ప్రజలు పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలోనే ఇంత బాహాటంగా దొంగతనం జరగడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.? రాత్రి సమయంలో వాహనాలు హనుమాన్ నగర్ ఏరియాలో అసలు తిరుగుతున్నాయా లేదా అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.? ఒక ఇంట్లో పోర్షన్లో అద్దెకుంటున్న ఇంటి పక్కనే మరో గదిలో దొంగతనం జరిగిందని తెల్లవారి చూసేసరికే తాళాలు పగలగొట్టి బయట ఉండడంతో పోలీస్ వారికి సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై బాలకృష్ణ పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. వేలిముద్రలను సేకరించడం కోసం క్లూస్ టీం ఉన్నట్లు ఆయన తెలిపారు.