కొండ మల్లెపల్లి,27-5-2022, స్వేచ్ఛ న్యూస్:
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారమంత కలిసి ముత్యాలమ్మ గుడి నిర్మాణం చేస్తుండగా, గ్రామానికి చెందిన కొందరు అడ్డు పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు కొండ మల్లేపల్లి తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. గుడి నిర్మాణ పనులు చేపడితే అంతు చూస్తామని బెదిరిస్తూ, కులం పేరుతో దూషిస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంతమ్మ, శ్రీరామ్, విజయ్, వెంకటయ్య, సామేల్, రామస్వామి, వినోద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.