తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలుకొండ మల్లెపల్లి,2-6-2022, స్వేచ్ఛ న్యూస్:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కొండమల్లె పెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఇన్చార్జి తహశీల్దార్ కుందేటి చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. రైతుల కోసం రైతు బీమా రైతు బంధు దళిత బంధు సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి, సర్వేర్ స్వప్న జూనియర్ అసిస్టెంట్ నరసింహ వీఆర్ఏల అధ్యక్షులు లింగం, విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *