ఎల్బీనగర్,8-6-2022, స్వేచ్ఛ న్యూస్:
అభివృద్ధి చేయడం చేతకాని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ అన్నారు. వీవీన గర్ కాలనీలో స్థానిక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, నాయకులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గడ్డిఅన్నారం డివిజన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి, కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్ రెడ్డి బస్తీ బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు మల్లిక, వర్కింగ్ ప్రెసిడెంట్ శైలజ తదితరులు పాల్గొన్నారు.