ఎల్బీనగర్,8-6-2022, స్వేచ్ఛ న్యూస్:
బల్దియా లో ఆంధ్ర యాజమాన్య రాంకీ సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేయాలని బీజేపి మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఉదరి గోపాల్ ఆధ్వర్యంలో ఎల్బి నగర్ మున్సిపాలిటీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ నెల 23 వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు డెడ్ లైన్ విధించిన జిహెచ్ఎంసి కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులతో కలిసి ప్రగతి భవన్ ముందు చెత్త పడేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు దాదాపు 15, 000 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ఇందులో కొంత మంది అధికారులు, రాజకీయనేతల హస్తం ఉందని ఆరోపణ చేశారు. అవినీతి పై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి సిబిఐ దర్యాప్తును కోరతామని అన్నారు. ధనికంగా ఉన్న జిహెచ్ఎంసి అప్పుల కుప్పగా మార్చారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి, రాంకీ సంస్థ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.