రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి



పి.ఏ పల్లి,8-6-2022, స్వేచ్ఛ న్యూస్:

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం చిలకమర్రి వద్ద సోమవారం రాత్రి బైక్ అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీ కొనడంతో యువకుడు మృతి చెందాడు. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడు మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆదిరాల వెంకటేష్(25) తన బైక్ పై కొండమల్లేపల్లి మండలం దేశముఖ్ వారి కుంట గ్రామానికి వెళ్లి తిరిగి పీఏ పల్లి మండలం చిలకమర్రి గ్రామం మీదుగా స్వగ్రామం వెళ్తుండగా, గ్రామ శివారులోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకటేష్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిలకమర్రి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్న పోలీసులు వెంకటేష్ కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *