దేవరకొండ,8-6-2022, స్వేచ్ఛ న్యూస్:
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం 18వ రోజుకు చేరింది. బుధవారం నేరడుగొమ్ము మండలం కాచరాజుపల్లి, బుగ్గతండా, బచ్చా పురం, పెద్దమునిగల్ గ్రామాలలో కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ అమలుతో రైతుల సమస్యలన్నీ తీరుతాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరు క్షణమే వరంగల్ డిక్లరేషన్ అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కిషన్ నాయక్, రవి నాయక్, సిరాజ్ ఖాన్, నరసింహారెడ్డి, కృష్ణయ్య, పాపా నాయక్, యుగేందర్ రెడ్డి, సోమని నాయక్, లక్పతి నాయక్, వెంకటయ్య, సుధాకర్, హరికృష్ణ, రమేష్ నాయక్, గిరి యాదయ్య, శ్రీను, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.