కులదురహంకార హత్యలపై కేసీఆర్ స్పందించాలి.ఎల్బీనగర్,9-6-2022, స్వేచ్ఛ న్యూస్:

బోడుప్పల్ లోని బాల పరమేశ్వర్ ఫంక్షన్ హాల్ లో ‘కుల అసమానతా నిర్మూలనా పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో వరుసగా జరుగుతున్న కులదుహంకార హత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కుల అసమానతా నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర కోఆటనేటర్ గురుమిళ్ల రాజు అద్యక్షత వహించారు. రాష్ట్ర కో కన్వినర్ జె. చక్రవర్తి సమన్వయకంగా వ్యవహరించారు. ముఖ్య అతిధిగా హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటి ప్రొఫెసర్ కే. వై. రత్నం హాజరై ప్రసంగించారు. ముఖ్య వక్తలుగా ఆల్ ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య, సిఏఎం రాష్ట్ర నాయకులు గడ్డం సదానందం, ఆదర్శ క్రిస్టియన్ అసోసియషన్ అధ్యక్షులు కే. రత్నంలు హాజరై ప్రసంగించారు.
ప్రొ. కే. వై. రత్నం మాట్లాడుతూ.. కులాంతర, మతాంతర ప్రేమవివాహాలను స్వాభిమాన పెళ్లిళ్లుగా అంగీకరించాలన్నారు. స్వాభిమానం ప్రతి ఒక్కరిలో అభివృద్ది చెందినప్పుడే కుటుంబంలో, సమాజంలో స్వాభిమానం పెరిగి బానిసత్యం, కులతత్వం , మతతత్వం, కుల, మత దురహంకారులు తగ్గుతాయన్నారు. ఇలాంటి స్వాభిమానం, స్వాతంత్రత కల్గిన యువతి యువకులను కులదురహంకార హత్యలు చేయడం అమానుషం అన్నారు. ఆల్ ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య మాట్లాడుతూ.. కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలను కుల వర్గ నిర్మూలనలో భాగంగా చూడాలన్నారు. అగ్రకుల బ్రహ్మణీమ మనువాద భావజాలాన్ని ప్రజల మొదల్లో నుంచి తొలగించడానికి పెద్దఎత్తున భావజల పోరాటం జరగాలన్నారు. గురుమిళ్ల రాజు, జె. చక్రవర్తిలు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యము కేసీఆర్ కులదురహంకర హత్యాలను ఖండిస్తు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండిచాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు అందరూ కులాంతర మతాంతర వివాహితుల రక్షణగా “నిరభ్యంతర చట్టం” కోసం మనమంతా కలిసికట్టుగా పోరాడాలన్ని అందుకోసం ప్రజలను సమీకరించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *