మార్షల్ ఆర్ట్స్ పై (కరాటే ) అవగవన సదస్సుదేవరకొండ,16-6-2022, స్వేచ్ఛ న్యూస్:

స్థానిక ట్రైబల్ మహిళా డిగ్రీ కళాశాలలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి అనుకోండి ఇతర ఇబ్బందుల గురించి అనుకోండి,వారిని వారు కాపాడు కొనడం పై మార్షల్ ఆర్ట్స్ పైన అవగాహన కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CI శ్రీనివాస్, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT మరియు సభ్యులతో కలిసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ బాలికల పై జరుగుతున్న అత్యాచారాల గురించి,వారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆపద టైంలో వారిని వారు రక్షించుకోవాలంటే ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని కాబట్టి ఆడ పిల్లలకు కరాటే అవసరమని అన్నారు.ఏ లాంటి అవసరం ఉన్నా ఈ ఆపద సమయంలోనైనా 100 కాల్ కు ఫోన్ చేయాలని, ఆడపిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు.అలాగే దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు చేపట్టిన ఈ మంచి కార్యక్రమాని వారు స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులని అభినందించారు.వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా వారన్నారు.ఈ కార్యక్రమంలో SIబాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణకిషోర్, వైయస్ కరుణాకర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, ప్రిన్సిపాల్ సునీల, PET రంగీలా, భాస్కర్ రెడ్డి, పి జె శాంసన్, తాళ్ల సురేష్,పాండు నాయక్, కుమార్, డాన్స్ మాస్టర్ ఏడుకొండలు,కరాటే మాస్టర్స్ శ్రీను, వెంకట్, ఆకాశ్, డాన్స్ మాస్టర్ జగన్, మహేశ్వరి, భవిత, శివరామరాజు, మింటూ, కార్తికేయ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, కాలేజీ సిబ్బంది, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *