ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలుదేవరకొండ, 21-6-2022, స్వేచ్ఛ న్యూస్:

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్, నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు స్థానిక ట్రైబల్ డిగ్రీ కళాశాల నందు జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమానికి RDO గోపి రామ్, మున్సిపల్ చైర్మన్ అలంపల్లె నరసింహ, ముఖ్య అతిథులుగా రావడం జరిగినది.వారు మాట్లాడుతూ ప్రపంచానికి యోగ విద్య అందించిన ఘనత మన దేశాన్ని దేనని, ప్రతి ఒక్కరూ యోగా ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్య వంతమైన సమాజం సాధ్యం అవుతుందని ఆస్తుల కన్నా ఆరోగ్యం ముఖ్యమని వారు అన్నారు.దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్ రావు అధ్యక్షత వహించిడం జరిగినది దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT, నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ వీరిద్దరూ మాట్లాడుతూ ఈ రోజులలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల,సరైన ఎక్ససైజ్ లేకపోవడం వల్ల చిన్నతనంలోనే షుగర్ బిపి అనేక ఇబ్బందులకు గురవుతున్నారుప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామం వల్ల,లేదా యోగ వల్ల మనం మానసికంగా ఎంతో రిలాక్స్ అవుతామని అన్నారు.యోగా ప్రతిదినం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని అన్నారు.అనంతరం యోగా గురువు కే వెంకటేశ్వర్లు యోగాసనాలు,సూర్య నమస్కారాలు సాధన చేయించారు. విద్యార్థులకు ‘ యోగా ఫర్ హ్యుమానిటీ అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సునీల,Pet రంగీలా,కొండల్,రమేష్,భాస్కర్ రెడ్డి,తాళ్ల సురేష్,డైరెక్టర్ వాసు,డాన్స్ మాస్టర్ జగన్,కరాటే మాస్టర్ వెంకట్,ఆకాష్,నరేష్,కళాశాల అధ్యాపకులు,యువజన కార్యకర్తలు,కళాశాల ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు,విద్యార్థులు,కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *