కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్.. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే గట్టి పునాది


స్వేచ్ఛ న్యూస్:
దేవరకొండ,29-6-2022:

పార్టీ కోసం పని చేసే వారికీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని వింజమూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మిడిదొడ్డి కొండల్ ఇటీవల మృతి చెందాడు. కొండల్ టీఆర్ఎస్ ప్రమాద బీమాలో సభ్యత్వం పొందడంతో బీమా పథకం కింద మంజూరైన రూ. 2లక్షల చెక్కును బుధవారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మృతుడి తండ్రీ మిడిదొడ్డి జంగయ్య కు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. గ్రామా స్థాయి నుంచి పార్టీ ని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు. కార్యకర్తల కుటుంబ శ్రేయస్సు కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణవెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రైతు బందు అధ్యక్షుడు ఉజ్జిని సాగర్ రావు, ప్రసాద్, జంగయ్య, సుమతి రెడ్డి, బోడ్డుపల్లి కృష్ణ, మురళి, శ్రీను, తరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *