స్వేచ్ఛ న్యూస్, వేములపల్లి: 29-06-2022. మండలంలోని గెజిటెడ్ అధికారులు ధ్రువీకరణ పత్రంలో సంతకాల కోసం వచ్చినప్పుడు ప్రజలను సంతకం పెట్టకుండా ఇబ్బంది పెట్టవద్దు అని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు బొంగరాల వినోద్ కోరారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకము నకు అర్హులైన అభ్యర్థుల తల్లిదండ్రులు తమ ధ్రువీకరణ పత్రములను గెజిటెడ్ అధికారితో దృవీకరించుకొని తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం నిబంధన కనుగుణంగా తమ సర్టిఫికెట్లను తీసుకొని అధికారుల దగ్గరికి ధృవీకరణ కోసం వచ్చినప్పుడు రకరకాల కుంటి సాకులు చెబుతూ గెజిటెడ్ అధికారులు ధ్రువీకరణ పత్రమును ధ్రువీకరించిన పోవటంతో అధికారుల చుట్టూ తల్లిదండ్రులు ప్రదర్శన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిజినల్ దృవీకరణ పత్రాన్ని చూసి జిరాక్స్ పై గెజిట్ సంతకం చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని కావున ఒరిజినల్ ధ్రువీకరణ పత్రం ఉన్నట్లయితే తప్పకుండా అధికారులు వారి యొక్క ద్రువీకరణ పత్రాలపై సంధకాలు పెట్టి వాళ్లకి సహకరించాలని ఆయన కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి గెజిటెడ్ అధికారులు లబ్ధిదారులకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బొంగరాల హరికృష్ణ దైద అశోక్ విడపంగు దయాకర్ పగడాల చందు సంపతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.