స్వేచ్ఛ న్యూస్:
దేవరకొండ,1-7-2022:
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల యందు జాతీయ వైద్య దినోత్సవం శుక్రవారం ఉదయం 12 గం. లకు వైద్యులకు సన్మాన కార్యక్రమం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయడం జరిగినది.అధ్యక్షుడు NVT సభ్యులందరితో కలసి డాక్టర్స్ ని శాలువాలతో సత్కరించి మెమొంటోస్ అందజేసినారు.అనంతరం డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు,అధ్యక్షుడు NVT మాట్లాడుతూ డాక్టర్స్ సేవలు మరువలేనివని,తల్లిదండ్రులు జన్మనిస్తే,పునర్జన్మ డాక్టర్స్ ఇస్తారని,భగవంతునికి మరో రూపం డాక్టర్స్ అని,ముఖ్యంగా కరుణ టైంలో డాక్టర్స్ చేసిన సేవలు మరువలేనివని,వారిని సంవత్సరానికి ఒక్కసారి ఇలా సన్మానించి కోవడం ఆనంద కరమని.ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణకిషోర్, వైయస్ కర్ణాకర్, రాపోలు నిరంజన్,ఉమా మహేష్, భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, రాక్ స్టార్ రమేష్, వి వి ఆర్, కుమార్, శేఖర్, కరాటే మాస్టర్ శ్రీను, డాన్స్ మాస్టర్ జగన్, నరేష్,వెంకటేష్, భాస్కర్, శ్రీను, కళాకారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు