గిరిజనులకు కుల,ఆదయ ధ్రువీకరణ పత్రాన్ని సకాలంలో ఇవ్యాలి.


స్వేచ్ఛ న్యూస్:
సరూర్ నగర్,2-7-2022:

-యం.ధర్మ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు, గిరిజన సంఘం. -సరూర్ నగర్ మండల తహసీల్దార్ కి వినతి.

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల పరిధిలో నివశిస్తున్న గిరిజన తేగలకు సకాలంలో కుల,ఆదయ ధ్రువీకరణ పత్రం ఇవ్వగలరని, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సరూర్నగర్ మండల తహసీల్దార్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.దర్మ నాయక్ మాట్లాడుతు కులము ఆదాయం సర్టిఫికెట్ దరఖాస్తును మీ సేవలో దరఖాస్తు చేసుకున్న …ఏదో కారణంతో కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి దీనికి మీరు పరిశీలించాలని వారు అన్నారు.సరూర్ నగర్ మండల పరదిలో అధిక సంఖ్యలో గిరిజనులు వలస వచ్చి స్థిర పడ్డరని, వారికీ సరిఅయిన అవహగన లేకపోవడం సరి అయిన ఆధారాలు ఇవ్వలేక పోయిన వాటికీ పరిశీలించి-సరిచేసి కుల,అదయం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని వారు కోరారు నగరంలో చెత్త ఎరుకుంటు, ఆటో నడుపుకుంటు,దినసరి కూలీలుగా జీవిస్తు అడ్డమిద్ద కూలీలుగా జీవిస్తు కాలం గడుపు తున్నారు.గిరిజనులు దరఖాస్తుచేసుకున్న గిరిజనులకు సర్వే చేసి పరిశీలించి కులధ్రువీకరణ- ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించి వారికీ సహకరించాలని కోరారు.సరూర్ నగర్ మండలం తహసీల్దార్ యం.జయశ్రీ మాట్లాడుతూ అర్హులైన గిరిజనులందరికి కుల,ఆదయ దృవీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు.సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వినతిపత్రం సమర్పించిన వారిలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.బాలు నాయక్,రాష్ట్ర నాయకులు ఆర్.శేఖర్ నాయక్,రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యం.గోపి నాయక్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *