స్వేచ్ఛ న్యూస్, వేములపల్లి: 03-07-2022. విద్యుత్ షాకుతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మీదేవి గూడెంలో చోటు చేసుకుంది పోలీసులు’ స్థానికులు ‘తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ముత్యాల శంకర్ (45) తన సోదరులైన సురేష్’ హరిచంద్ర’తో కలిసి గ్రామ సమీపంలోని ఉన్న వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో మోటార్ కు కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన ట్రాన్స్ఫారం ను ఆఫ్ చేసేందుకు శంకర్ వెళ్లాడు ఇందులో భాగంగా . ఏబి స్విచ్ ను ఆఫ్ చేసేందుకు పట్టుకొనగా విద్యుత్ శాఖ కొట్టి అక్కడే పడిపోయాడు. ఇట్టి విషయాన్ని గమనించిన సోదరులు క్రిందపడి ఉన్న శంకరును లేపి కాళ్లు చేతులు రుద్దుతుండగా మరణించాడు. ఇట్టి విషయాన్ని గ్రామంలోని కుటుంబ సభ్యులకు తెలియజేయగా ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగానికి ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తము మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్ తెలిపారు.
