అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమతుల్యత కేసిఆర్ తోనే సాధ్యం: మంత్రి జగదీశ్ రెడ్డి

స్వేచ్ఛ న్యూస్, నకిరేకల్, నార్కెట్పల్లి, జూలై 4:

దళితుబంధు ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుంది

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది

ప్రపంచ వ్యాప్తంగా సామాజిక విప్లవం సృష్టిస్తుంది

ఉద్యమ కాలంలోనే పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ

ఆర్థిక అసమానతలు రూపుమపాలన్న సంకల్పం మేరకే

గాంధీ, నెహ్రు, అంబెడ్కర్ కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ముందుకు
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు పధకం కింద నాలుగు కోట్ల 50 లక్షల విలువ చేసే వాహనాలను లబ్దిదారులకు పంపిణీ

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు

నకిరేకల్ మండలం నడిగూడెంలో ఐదు గురికి, వల్లబాపురంలో 18 మందికి, నార్కెట్పల్లి మండలం బాజాకుంటలో 22 మంది లబ్ధిదారులకు అందజేత

దళిత బంధు పధకం దళితుల ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. సోమవారం నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్ మండలం నడిగూడెం, వల్లబాపురం గ్రామాలతో పాటు నార్కెట్పల్లి మండలం బాజాకుంట లకు చెందిన 45 మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే వాహనాలను మంత్రి జగదీష్ రెడ్డి గ్రామాల వారిగా చేరుకుని అందజేశారు. అనంతరం ఆయా గ్రామాలలో లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి లబ్ధిదారులకు సూచనలు అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలలో మాట్లాడుతూ ఉద్యమ కాలంలోనే ఉద్యమ నేతగా ఈ బృహత్తర ప్రణాళికకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంకురార్పణ చుట్టారని తెలిపారు. అది నేడు అమలులోకి వచ్చిందన్నారు. ఆర్థిక అసమానతలను రూపు మాపడం తో పాటు అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమతుల్యతను ఈ పథకం నెరవేరుస్తుందన్నారు. దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలకనుందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ మొదలు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ లు కన్న కలలు ఈ పధకం తో సాకరమౌతుందాన్నారు. గడిచిన 75 ఏండ్లుగా కొంత ప్రయత్నం జరిగినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాలేదన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి పై ప్రత్యేక దృష్టి సారించి రూపొందించిన ఈ పధకం ప్రపంచ వ్యాప్తంగా సామాజిక విప్లవం సృష్టిస్తుందన్నారు.

బాజకుంట గ్రామంలో దళితబంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి

నార్కెట్పల్లి మండలం బాజకుంట గ్రామంలో లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు అందజేస్తున్న మంత్రి

నార్కట్ పల్లి మండలంలోని బాజకుంట గ్రామంలో దళితబంధు పథకం ద్వారా 22 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన వివిధ యూనిట్లను సోమవారం సాయంకాలం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీవో జగదీష్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ శిరబోయిన సావిత్రి కుమారస్వామి, నాయకులు మేకల రాజిరెడ్డి, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, కన్నెబోయిన సైజులు యాదవ్, చిరుమర్తి యాదయ్య, బద్దం రామ్ రెడ్డి, ఎలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *