అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 31: రామగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బుక్స్ తీసుకు వెళ్లడానికి సరైన బ్యాగ్స్ లేకపోవడంతో వారు అర్ష ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడంతో స్పందించి విఎస్ఏ డెవలపర్స్ బలుమూరి సుమన్ రావు,అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి సహకారంతో 300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి ఎస్ ఏ డెవలపర్స్ టీం ఎండి వసీం,,ఎస్ అజయ్ కుమార్,ఎండి మాన్సూర్,ఎండి తన్వీర్,ఆర్ సాయికిరణ్ హర్ష ఫౌండేషన్ ఫౌండర్ అర్ష బూడిద,వెంకటేష్వరుణ్,రవితేజ,మంజు,అబయ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Share this…

శ్రీ కృష్ణార్జునులను దర్శించుకున్న మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 28: గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు సమీపంలో ని హనుమానగర్ లో గల శ్రీ కృష్ణార్జున దేవాలయంలో అధిక శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన సుదర్శన యాగానికి విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీ కృష్ణార్జునులైన ఆ భగవంతుని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వరద దాటి నుండి వారిని కాపాడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 41 వ డివిజన్ కార్పొరేటర్ గాదం విజయ-నందు,కార్పొరేటర్ మహంకాళి స్వామి,చుక్కల శ్రీనివాస్,రాజిరెడ్డి,యుగేందర్,దాసరి,విజయ్,తిరుపతి రెడ్డి,శివ,చంటి ఆలయ ధర్మకర్త,సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Share this…

శ్రీకృష్ణార్జున దేవాలయంలో అఖండ సుదర్శన యాగం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 28: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ హనుమానగర్ లో గల శ్రీ కృష్ణార్జున దేవాలయంలో శుక్రవారము ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు వేద పండితులు శ్రీ కృష్ణార్జున దేవాలయం అర్చకులు రమేష్ అయ్యగారు ఆధ్వర్యంలో గోదావరిఖని రామాలయం అయ్యగారు శ్రావణ్ వేద మంత్రోచ్ఛారణతో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు, అలంకారాలు చేసి తొమ్మిది గంటల నుండి 12:45 నిమిషాల వరకు14 జంటలతో నాలుగు హోమ గుండాలు వేసి రామగుండం ప్రజలు హోమంలో పాల్గొన్న భక్తులు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని సుదర్శన యాగం నిర్వహించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ కృష్ణార్జున దేవాలయం ధర్మకర్త అమలానంద సునీత స్వామి సేవకులు మహంకాళి సంపత్ మెండే ఓదెలు పురుషోత్తం రమేష్ బూడిద లింగయ్య రాజు వైనాల భారతమ్మ మారేపల్లి సారమ్మ నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీకృష్ణ భగవానుని కృపకు పాత్రులు అయ్యారు.

Share this…

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతకు సీఐ జగదీష్ అవగాహన సదస్సు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై25: సుల్తానాబాద్ షర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల యువతకు సీఐ జగదీష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత ఒత్తిడిని భరించలేక దూరాలవాట్లకు బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తూ విద్యార్థులు,యువత ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆన్లైన్ మోసాలకు,నకిలీ బ్యాంక్ లోన్ అప్ లకు మోసపోవద్దని ప్రజల్లో చైతన్యం రావాలంటే యువతతోనే సాధ్యం అని అన్నారు.సోషల్ మీడియా ఎక్కువ కీడు చేస్తుందని టెక్నాలజీ ముసుగులో జరుగుతున్నా మోసాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.ప్రతి దాంట్లో మంచి చెడులు రేమడు ఉంటాయి టెక్నాలజీని మంచికే ఉపయోగించుకొని మంచి మిత్రులతో స్నేహం చేసి దేశ అభ్యన్నతి కోసం యువత పాటుపడాలని సూచించారు. పోలీస్ ఆధ్వర్యంలో వచ్చే నెల నిర్వహించే బ్లడ్ డొనేట్ కార్యక్రమానికి అధికల సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేసి ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడలని కోరారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎస్ ఐ విజయేందర్ కాల్వ,శ్రీరాంపూర్ ఎస్ ఐ శ్రీనివాస్,జూలపల్లి ఎస్ ఐ వెంకటకృష్ణ,పోలీస్ సిబ్బంది,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలే సాధనగా డిజేఎఫ్ జర్నలిస్టుల గర్జన సభ

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 25: డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపెల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని తిలక్ నగర్ లో గల విశ్వం ఫంక్షన్ హాల్ లో ఈరోజు జర్నలిస్టుల ఇండ్ల స్థలాలే సాధనగా జర్నలిస్ట్ ల గర్జన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ స్థాయి నాయకులు,గౌరవ అధ్యక్షులు విశ్వనాధ్,అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి,రాష్ట్రస్తాయి నాయకులు అధ్యక్షులు రత్నాకర్ పటేల్,ప్రధాన కార్యదర్శి కొత్త యాదిరెడ్డి, పెద్దపల్లి జిల్లాస్థాయి నాయకులు అధ్యక్షులు సబితం లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి ఇంజం సాంబశివరావులు మాట్లాడుతూ అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులకు రావాల్సిన ఇండ్ల స్థలాలు ప్రభుత్వ పథకాలు హక్కులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న పెద్ద పత్రికలని వేరు చేసి మాట్లాడే వారికి సరైన సమయంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాధానం చెబుతుందని అన్నారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకంటి చందర్ డిజెఎఫ్ లో సభ్యత్వం కలిగిన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇన్సూరెన్స్ కల్పిస్తానని మాట ఇచ్చారని డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు అన్నారు.వివిధ జిల్లాల నుంచి వర్షాన్ని కూడ లేక్క చేయకుండా వచ్చిన నాయకులకు జర్నలిస్టులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులను తీసుకువచ్చిన ఆ జిల్లా అధ్యక్షునికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.జర్నలిస్ట్ మిత్రులు అందరితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలని కలంకు ఉన్న విలువ తెలుసుకుంటూ సమాజానికి తెలుపుతు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ న్యూస్ బృందం మాతంగి శివరాజ్,కోదాటి వినోద్ కుమార్, కోదాటి వినోద్ కుమార్,నీలం కుమార్,మిట్టపల్లి అశోక్,గోషిక లక్ష్మణ్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన డీజేఎఫ్ సభ్యులు రామగుండం జిల్లా లోని చిన్న పెద్ద ఎలక్ట్రానిక్ ఫ్రింట్ మీడియా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

మభ్యపెడుతున్న కాంగ్రెస్ నాయకులు అన్న ఎమ్మెల్యే చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: సోమవారం రాష్ట్ర పురపాలక,ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మనో చైతన్య,అమ్మ పరివర్,శ్రీ ధర్మశాస్త్ర నిత్త్యాన్నదాన ఆశ్రమాల్లో వేరువేరుగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రామగుండం శాసనసభ్యులు కోరికంటి చందర్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాకుండా ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. 9 ఏళ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయునిగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ దేశాలన్నీ తిరిగి సుమారు 12 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారని 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి,సంక్షేమానికి నోచుకోక బ్రష్టు పట్టిపోయిందని ఎమ్మెల్యే చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే ప్రతి ఇల్లు సంక్షేమ పథకాలతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని చందర్ ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం పాటుపడే నాయకత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్,డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు,కార్పొరేటర్లు బొడ్డు రజిత రవీందర్,దొంత శ్రీనివాస్,బాలరాజ్ కుమార్,కొమ్ము వేణుగోపాల్,జనగామ కవిత,సరోజినీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

కేటీఆర్ జన్మదినం సందర్భంగా అర్ష ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: గోదావరిఖని బస్టాండ్ వద్ద కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కందుల సంధ్యారాణి,మిర్యాల రాజిరెడ్డి, పాత పెళ్లి ఎల్లన్న,కొంకటి లక్ష్మీనారాయణ,బయపు మనోహర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this…

వీరాంజనేయ హమాలీ సంఘం కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

రామగుండం, జులై 24: గోదావరిఖని లక్ష్మీనగర్ రీగల్ షూమార్ట్ వద్ద గల వీరాంజనేయ హమాలీ సంఘం కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతపల్లి ఎల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ శాసనసభ్య ఆశావాహులు మిరియాల రాజిరెడ్డి,కందుల సంధ్యారాణి,పాతపల్లి ఎల్లయ్య,కొంకటి లక్ష్మీనారాయణ, బయ్యపు మనోహర్ రెడ్డి పాల్గొని సంఘటిత అసంఘటిత కార్మికుల మధ్యలో కేటీఆర్ జన్మదిన కేకును వారి చేతిలో మీదుగా కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. కేటీఆర్ భారత దేశంలోనే మన రాష్ట్రాన్ని ఐటి రంగంలో మొదటి స్థానంలో ఉంచడం కోసం,నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూన్నా మన కల్వకుంట్ల తారక రామారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత యువత ఉద్యోగల కోసం తల్లడిల్లుతుంటే వారికి అవకాశాన్ని కలిగించేందుకు దేశ విదేశాలు తిరుగి ఇండస్ట్రీస్,ఐటీ పార్క్ తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తుంది మన రామన్న అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరాంజనేయ హమాలీ సంఘం నాయకులు కొమ్ము కుమారస్వామి,వడ్డేపల్లి మహేందర్,పున్నం కిషన్,తన్నూర్ శ్రీనివాస్,మల్లతుత్తుల లక్ష్మణ్,బలిగే రమేష్,ఉష్కే రవి హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share this…

అన్నా అంటే వెన్నంటి నిలుస్తడు కేటీఆర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: రాష్ట్ర పురపాలక పరిశ్రమల ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ లో భాగంగా సోమవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలి వాడకు చెందిన నిరుపేద ఒంటరి మహిళ గాదేం రాజమ్మ నూతన ఇల్లును ఎమ్మెల్యే గిఫ్ట్ గా అందించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం కోరుకంటి చందర్ మాట్లాడుతూ అన్నా అంటే వెన్నంటి ఉండి అభయ హస్తాన్ని అందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యం ఉన్న గొప్ప మహా నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి నిరుద్యోగులకు,పేదలకు ఉపాధి అవకాశాన్ని కల్పించిన ఘనత కేటి రామన్నదని అన్నారు. కేటీఆర్ పిలుపు మేరకు నిరాడంబర జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆముల నారాయణ,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బింగి అనిల్ కుమార్,వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి,మండల కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా,ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్,సర్పంచులు ధరణి రాజేష్,బాధరవేణి స్వామి,ధర్మాజీ,కృష్ణ,బండారి ప్రవీణ్,తుంగపిండి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share this…

పారిశుద్ధ్య కార్మికులను కలిసిన ఠాగూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 24: ఈరోజు ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులను పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ కలిసి మాట్లాడుతూ వారి బాగోవులు అడిగి తెలుసుకుని వారికి రావాల్సిన రైన్ కోట్లు,షూస్, గ్లౌస్,డ్రెస్ ఇవ్వాలని, వారి ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా టౌన్ ప్రెసిడెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంజా శ్రీనివాస్ 45వ డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి నారాయణ,బెజ్జాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this…