Entries by admin

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు వినతి పత్రం ఇచ్చిన కోరుకంటి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 25: రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల వల్ల పేద,మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుతుందని ఇంకా ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని,ఫైవ్ ఇంక్లైన్ యు.పి.హెచ్.సి భవన నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేయాలని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గురువారం రోజున హైదరాబాదులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. […]

యాదవుల ధర్నాకు బయలెళ్లిన సంఘం నాయకులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 25: హైదరాబాదులో జరగబోయే యాదవుల ధర్నాకు బయలెల్లి వెళ్తున్న పెద్దపెల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ గుంపుల ఓదెలు యాదవ్, రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ పాతపెళ్లి రవి యాదవ్, కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బోయిన మల్లేష్ యాదవ్ తదితరులు వెళుతున్నట్లు గుంపులు ఓదలు యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. Share this… Whatsapp Facebook

ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 25: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెన్నల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనంపేట గ్రామంలో ఏసీపి సదయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్ సిఐ రాజ్ కుమార్ గౌడ్,నెన్నల్ ఎస్ ఐ శ్యామ్ పటేల్ 20 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ,భద్రత పోలీస్ బాధ్యత అని […]

నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులు ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా మంథని,ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలలో విత్తనాలు,ఎరువులు అమ్మే ఫర్టిలైజర్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీస్,వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కలిసి ఎరువులు,విత్తనాలు అమ్మే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు,ఎరువులు అమ్మరని తెలిసిన, అమ్మిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎవరు […]

ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిని బైండోవర్ చేసిన పెద్దపల్లి పోలీసులు

స్వేచ్ఛ న్యూస్, పెద్దపల్లి, మే 22: పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ కేంద్రంలోనీ ఐదుగురు వ్యక్తులు జులయ్ గా తిరుగుతూ ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి, ప్రశాంత వాతావరణం, ప్రజాశాంతి కి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని సోమవారం పోలీస్ స్టేషన్ కి తరలించి ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి బైండొవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలను అకారణంగా ఇబ్బందులకు గురి చేసే వారు ఎవరైనా […]

వేజ్ బోర్డ్ సాధించినందుకు గోదావరిఖని చౌరస్తాలో బాణసంచా కాల్చిన ఏఐటియుసి శ్రేణులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: బొగ్గు గని కార్మికుల 11వ ఏజ్ బోర్డ్ ఒప్పందం సాధించిన సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏఐటియుసి బాణసంచా కాలుస్తూ విజయోత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు మడ్డి ఎల్లాగౌడ్ ఏఐటీయూసీ ఆర్ జీవన్ బ్రాంచ్ కన్వీనర్ ఆరెల్లి పోషం ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్,మహేష్,నాయకులు ఎస్ వెంకట్ రెడ్డి,భోగ సతీష్ బాబు,పార్లపల్లి రామస్వామి,పి నాగేంద్ర తో పాటు తదితరులు పాల్గొన్నారు. […]

అనార్తులకు కొండంత అండా కోరుకంటి

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: రామగుండం నియోజకవర్గం లోని అనార్తులకు నిరుపేదలకు కుండంత అండగా నిలుస్తున్నారు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆపద ఉందంటే తను ఉన్నానని భరోసానిస్తున్నారు గోదావరిఖని పట్టణంలోని విట్టల్ నగర్ కు చెందిన వృద్ధుడు రాగటి లక్ష్మయ్య ఆదివారం మృతి చెందాడు వృద్ధుని కుటుంబం నిరుపేద కావడంతో అంతక్రియలకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ విషయం తెలుసుకున్న రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ విజయమ్మ ఫౌండేషన్ బాధ్యులు సిద్ధార్థ ద్వారా ఐదు […]

ముస్లిం మహిళల కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా 20 కుట్టు మిషన్ కేంద్రాలు ప్రారంభం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే22: రామగుండం నియోజకవర్గం లోని పేద ముస్లిం మహిళల కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా 20 కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తెలిపారు. శాసనసభ్యులు ఆదేశాల మేరకు సోమవారం స్థానిక 42 వ డివిజన్ లో విజయమ్మ ఫౌండేషన్ వారి మహిళా సాధికారత కేంద్రంను మహిళ కోఆప్షన్ సభ్యురాలు తస్లీమా భాను ప్రారంభించారు. పేద ముస్లిం మహిళలల ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళ […]

లెనిన్ నగర్ సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ లెనిన్ నగర్ లో సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ రూంలు నిరుపయోగంగా పడి ఉండటంతో అందులో చెత్తాచెదారం పేరుకుపోయి ఈరోజు సుమారు మధ్యాహ్నం 1:30 గంటల నుండి 2:00 గంటల మధ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు అత్యవసర విభాగమైన అగ్నిమాపక కేంద్రానికి 101 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవకపోవడంతో పిల్లల సహకారంతో కాలనీవాసులు అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి […]

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 21: దివంగత మాజీ ప్రధాని,భారతరత్న అవార్డు గ్రహీత గౌరవ రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మూలమలుపు వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సంగ్ రాజ్ ఠాకూర్ […]