బ్రాహ్మణ వెల్లంల, కొత్తగూడెం పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 23: ఈనెల 30న జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల, కొత్తగూడెం పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ సందర్భంగా గురువారం జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ యూపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ సింగ్ మీనన్ ఆయా పోలింగ్ స్టేషన్లను స్థానిక సీఐ మహేష్, ఎస్సై సైదాబాబు లతో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామాలను సందర్శించి గ్రామ ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే బైండోవర్ చేయాలన్నారు. గత ఎన్నికలలో జరిగిన వివాదాల గురించి విచారించారు. ఈనెల 30న జరగబోవు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టిందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Share this…

రామగుండం నియోజకవర్గంలో పార్టీల పేరుతో వ్యక్తుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్న రమేష్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 13: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ తనను గెలిపించాలని ఇందిరా నగర్ చౌరస్తా,సంజయ్ గాంధీనగర్,శాంతినగర్,లూర్దు నగర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది.ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో వ్యక్తుల పేరుతో,పార్టీల పేరుతో,హోదాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసం మోసం చేస్తున్నారని ఆరోపించారు.ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కోరికంటి చందర్, ఒకసారి చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణ,మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ గాని ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లేదని ఆరోపించారు.పదవుల ఆశతో ప్రజలకు డబ్బు,అభివృద్ధి ఆశ చూపుతూ మిమ్మల్ని మోసం చేస్తున్న నాయకులను ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు.నిరంతరం మీ అభివృద్ధికి పాటుపడే నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చలిగంటి ఓదెలు,రామచంద్రయ్య,అఖిల్ వర్మ,జక్కం కవిత,పొన్నం రజిత,చలిగంటి ఓదెలు,అనుచరులు,తదితరులు పాల్గొన్నారు.

Share this…

రామగుండం ప్రాంతాన్ని చీకటిమయం చేయాలని చూస్తున్నారన్న ఠాగూర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 13: ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 20,21,22 డివిజన్లలో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ఇంటింటా ప్రజలను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ బి పవర్ ప్లాంట్ మూసివేసి ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేయాలని బిఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు.ఈ ప్రాంతం బాగుపడాలి అంటే దోపిడీ జరగవద్దు ప్రశ్నించేవారు ఉండాలని అన్నారు.స్థానిక శాసనసభ్యుని చాతకానితనంతో ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని ఆరోపించారు.కుందనపల్లి బూడిదను అమ్ముకుంటున్నాడని అన్నారు.కుందనపల్లి గ్రామ ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.గోదావరి నదిలో నిండా నీళ్లు ఉన్న దూకి చావడానికి తప్ప తాగడానికి పనికి రావడం లేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటో డ్రైవర్లను కార్మికులుగా గుర్తించి వారికి ఇండ్లు ఇస్తామని,ఇంటి స్థలాలు ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఇస్తామని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹10,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బిఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా ఉద్యోగాల దోపిడీ,ఇసుక దోపిడీ,బూడిద దొంగతనం చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో పదివేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొని మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు.ప్రజాహితం కోరే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,దళిత బంధు,బీసీ బందు,మైనార్టీ బందు,ఇంటికో ఉద్యోగం,మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి 500 కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ,ఇంటి స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు.మహిళలకు ఆర్.టి బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పోరాటం చేస్తున్నానని కాబట్టి చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,వివిధ డివిజన్ల నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

బిఆర్ఎస్ అంటే భారత రైతు సమితన్న చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 13: గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోరికంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ మళ్లీ మీరు గెలిస్తే రామగుండం ప్రజలకు ఏం చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాదనుకున్న మెడికల్ కళాశాల,ఐటి,ఇండస్ట్రియల్ పార్క్,మాతంగి నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్న నాటి కాలం నుండి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం,సింగరేణి,ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి అసాధ్యమని ఆశలు వదిలేసుకున్న ఖూర్జ్ కమ్మి భూములకు పట్టాలు సాధించామన్నారు.రామగుండం నియోజకవర్గ ప్రజలు ఏమి కోరుకుంటారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా సౌకర్యాలు కలిగించడమే నా మేనిఫెస్టో అన్నారు.తాను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినంక గోదావరి నదికి కరకట్ట,టూరిజం స్పాట్ గా తీర్చిదిద్ది,తీగల వంతెన నిర్మాణం,నర్సింగ్ కళాశాల,మైనింగ్ పాలిటెక్నిక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్ర్ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు.శనివారం గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,కర్ణాటక మంత్రి శివకుమార్ మాటలతో తెలంగాణ రైతాంగం ఆందోళన చెందుతుందన్నారు.తెలంగాణలో సాగుకు 24 గంటల కరెంటు అవసరం లేదని మూడు గంటల కరెంటు సరిపోతుందని రైతులను బిచ్చగాళ్లతో పోల్చడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్ట చూస్తూన్నా కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టడానికి రైతాంగం సిద్ధంగా ఉందన్నారు.కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక సాగుకు విత్తనాలు,ఎరువులు దొరకక ఆకలి చావులు,ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి నీరందిస్తూ,సాగుకు ఏటా పదివేల రూపాయల రైతుబంధునిస్తూ 24 గంటల ఉచిత కరెంటు,సకాలంలో విత్తనాలు ఎరువులు అందిస్తూ పండించిన ప్రతి గింజను కొని రైతును రాజుగా చేసింది కెసిఆర్ పాలనలోని తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి అని నిరూపించిందన్నారు.సభ రోజు కనీసం అమరవీరుల స్థూపానికి నివాళులైన అర్పించని నాటి సమైక్య పాలన ఉద్యమ ద్రోహులు ఉద్యమకారుడునైన నన్ను వ్యక్తిగతంగా బదనాం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.ఈ విలేకరుల సమావేశంలో నగర మేయర్ బింగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు,మాదాసు రామ్మూర్తి,తానిపర్తి గోపాలరావు,జేవి రాజు,అచ్చ వేణు,చల్లగుల మొగిలి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this…

తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ చర్చిల్లో ప్రార్థనలు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 12:ఆదివారం ఉదయం తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్ తనను గెలిపించాలని గోదావరిఖనిలోని ఫైవ్ ఇంక్లైన్ ఏరియా లోని కృష్ణ నగర్లో కల్వరి గోస్పాల్ చర్చ్,గ్రేస్ గోస్పాల్ చర్చ్ బాపూజీ నగర్ లోని క్రీస్తు ఆలయ చర్చ్ ఎన్టీఆర్ నగర్ లోని ఆజాతే ఫుల్ గ్రేస్ ఫుల్ చర్చిలలో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన రానున్న 30వ తారీకు అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయా పాస్టర్లను కోరారు. ఈ సందర్భంగా గొర్రె రమేష్ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి రమేష్ పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికై కృషి చేసే అవకాశం లభించాలని పాస్టర్లు దైవజనులు అంతా కూడా ఆయా చర్చిలలో ఏసుప్రభును ప్రార్థించి వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గొర్రె రమేష్ శ్రీమతి గొర్రె లక్ష్మి,సెలిగంటి ఓదెలు,జక్కం కవిత,పెండ్లి కుమారి,గుండ్ల పోచం,జి అఖిల్ వర్మ,పాస్టర్లు,దైవజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this…

రామగుండంలో గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలన్న చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 11:గోదావరిఖని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో పాలకుర్తి జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన ఫాతిమా,రామగుండం బిజెపి బీసీ మోర్చా అధ్యక్షుడు చుక్కల రాములు యాదవ్,బిజెపి సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు వారిని గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది మన బతుకులు మారాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతాయని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వివరించి ప్రజలకు అవగాహన కల్పించి బిఆర్ఎస్ పార్టీకి గెలుపుకు అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిమ్మి బాబు,గోపు ఐలయ్య యాదవ్,జేవి రాజు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share this…