డాక్టర్ అద్దంకి శంకర్ ను కొనియాడిన మద్దెల దినేష్ రామగుండం పెద్దపెల్లి జిల్లా
డాక్టర్ అద్దంకి శంకర్ ను కొనియాడిన మద్దెల దినేష్ రామగుండం పెద్దపెల్లి జిల్లా ఏప్రిల్ 22/ స్వేచ్ఛా న్యూస్: గోదావరిఖని విట్టల్ నగర్ కు చెందిన సూరంపూడి వేణు సాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి రోలర్ స్కట్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించినందుకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ వేని సాయిని సన్మానించారు.అనంతరం మధ్ధేల దినేష్ మాట్లాడుతూ. కరీంనగర్ లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి రోలర్ స్కెటింగ్ ఛాంపియన్షిప్ పోటల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి తెలంగాణ తరఫున రామగుండం మండలం గోదావరిఖని కి చెందిన సూరంపూడి వేణు సాయి ఈనెల ఏప్రిల్ 26 నుండి 30వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం మహలిలో జరగబోయే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో పాల్గొనడం గర్వకారణం కానీ సాధారణ పేద కుటుంబంలో పుట్టి తను ఎంచుకున్న క్రీడల్లో చిన్నతనం నుండి అత్యంత ప్రతివంతుడిగా మన్ననలు పొందిన సూరంపూడి నాగేశ్వరరావు-దేవీ దంపతుల కుమారుడు సూరంపూడి వేణు సాయి జాతీయ స్థాయిలో జరిగే పోటీలో పాల్గొనడానికి అవకాశం లభించింది కాని తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల అదృష్ట ఇబ్బంది పడుతున్న వేణు సాయి తన పరిస్థితిని తన మిత్రులు సామాజిక కార్యకర్త ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ కార్యదర్శి గడప శ్రీకాంత్ కి వివరించగా తక్షణమే స్పందించి పలు స్వచ్ఛంద సంస్థల సహాయం కోరగా విదేశాల్లో గౌరవ వైద్య నిపుణులుగా సేవలందిస్తున్న డాక్టర్ అద్దంకి శంకర్ సూరంపూడి వేణు సాయి జాతీయ స్థాయి రోలర్ స్కేట్టింగ్ విభాగంలో పాల్గొనేందుకు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిలను ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడినైన నా ద్వారా విషయం తెలుసుకుని ఒక మంచి క్రీడాకారుడికి చేతను అందించాలని సదుద్దేశంతో తన వంతుగా 30 వేల రూపాయలను పోటీల్లో పాల్గొనడానికి సహాయం చేసినందుకుగాను పలు స్వచ్ఛంద సంస్థలు,మద్దెల దినేష్ డాక్టర్ అద్దంకి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి శంకర్ ఎక్కడో విదేశాల్లో వైద్య సేవలు అందిస్తూ వేణు లాంటి ప్రతిభావంతులైన నిరుపేదలను ప్రోత్సహిస్తూన్న మనసున్న మాహరాజని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో హర్ష ఫౌండేషన్ నిర్వాహకులు బూడిద హర్ష,స్వచ్ఛంద సంఘాల నాయకులు రేణిగుంట నరేంద్ర,ఆలూరి సుధీర్,వెంకటేష్,మండల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!