పారిశుద్ధ్య కార్మికులకు మేడే కానుక లివింగ్ వేతనం అమలు చేయాలి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 4: ఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్ ఇచ్చిన ఒక పత్రిక ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేడే కానుకగా ఒక్క లక్ష 6వేల 474 మంది మున్సిపల్ మెట్రో వాటర్ వర్కర్స్,గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మేడే కానుకగా వెయ్యి రూపాయల పెంపు ప్రకటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పెరుగుతున్న ధరలతో అనేక రంగాల కార్మికులు తీవ్ర ఇబ్బందుల పాలు అవుతున్నారు ముఖ్యమంత్రి వేయి రూపాయల కానుక ఈనాటి ధరలకు సరిపడేది కాదు 2021 పిఆర్సి నివేదికలో కనీస బేసిక్ 19వేలు నిర్ధారించిందన్నారు. అవుట్ సోర్సింగ్ జీవో 14 కు 30 శాతం ఫిట్మెంట్ కలిపి జీవో 60గా పేర్కొంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పిఆర్సి జీవో 60 అమలు చేయాలన్నారు. దానిని వదిలేసి వెయ్యి రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు 50 వేలు ఉంటారు వీరందరికీ నెలకు రూ; 8500 అమలవుతుంది 30% పిఆర్సి ఫిట్మెంట్ జిపి కార్మికులకు అమలు చేయట్లేదు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి పోయే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలకు 30% అమలుచెస్తున్నారు. 40 సంవత్సరాలు పనిచేసే జిపి కార్మికులకు మొండి చేయి దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు చాలీచాలని జీతాలతో జిపి కార్మికులు,జీతాలు పెంచాలని పిఆర్సి జీవో అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఒకే రకమైన పనికి తక్కువ ఎక్కువ జీతాలు ఉండకూడదని పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్న వేతనం తాత్కాలిక(అవుట్సోర్సింగ్ కార్మికులకు)ఇవ్వాలని 2016 భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంటుంది.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి రాజ్యాంగ సూత్రాలు అమలు చేయాలని తెలియదా అన్నారు. కార్మికులు జీవించడానికి సరిపడా వేతనాన్ని(లీవింగ్ వేజు)అమలు చేయాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!