మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 1: ప్రపంచ కార్మిక శక్తికి నిదర్శనం మేడే సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణం లో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో సోమవారం కార్మిక సంఘాల నాయకులు రవి, ఉదయ్ ఆధ్వర్యంలో మే డే వేడుక లలో డిసిసి అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ రాజ్ టాకూర్ జెండా ఆవిష్కరించి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో కార్మికులు కార్మిక హక్కుల సాదనకు ఎనలేని పోరాటం చేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన కార్మిక హక్కులు సాధించిన వారి ఆశయాల సాధనకు అనుగుణంగా ఈరోజు మే డే వేడుకలు చేసుకుంటున్నారని అన్నారు. నేను మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కల్లారా ప్రత్యక్షంగా చూస్తున్నాను జిహెచ్ఎంసి మాదిరిగా మునిసిపల్ ఉద్యోగులను రెగులర్ చేస్తూ వారికి ఇచ్చే వేతనాలు కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇవ్వాలని వీరిని నిర్లక్ష్యం చేయవద్దని వీరికి ఈ ఎస్ ఐ, ఇన్సూరెన్స్, ఈపిఎస్, టిఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఇంక్రిమెంట్, హెల్త్ కార్డు లాంటి ప్రభుత్వపరమైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!