గతంలో వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్న కొత్త శిలాఫలకాల ప్రారంభోత్సవమా?
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 7: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాబోతున్న సందర్భంగా గతంలో పలు అభివృద్ధి పనుల కోసం వేసిన శిలాఫలకాలు అభివృద్ధి పనులు జరగక వెక్కిరిస్తున్నాయని 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో ఆదవారం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 29వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి హాజరైనారు విఠల్ నగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ ను, చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న లక్ష్మీ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ ను, యుగేందర్ ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ లో ఆగిపోయిన కళాభవన్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించి నిరసన తెలిపారు. చుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ కాకుండా 5ఇంక్లైన్ చౌరస్తాలో కుర్చీ వేసుకుని కూర్చుంటానని చేసిన వాగ్దానాన్ని గుర్తుచేస్తూ కేటీఆర్ కోసం కుర్చీ వేసి నిరసన తెలపడం జరిగింది. అనంతరం నాయకులు ప్రసంగిస్తూ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు మూలకు పడి గతంలో వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్న మళ్లీ శిలాఫలకాలు వేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఓసిపి 5 మట్టి గుట్టల రూపంలో కనిపిస్తుందని మన ఎమ్మెల్యే దగ్గరుండి మట్టి గుట్టలను చూపిస్తే మీరు చేసిన అభివృద్ధి ఎంత గొప్పదో తెలుస్తుంది అన్నారు. ఈ ప్రాంతంలో గోదావరిలో బోటీంగ్,మున్సిపల్ పబ్లిక్ పార్క్,మల్కాపూర్ చెరువులో,మినీ ట్యాంక్ బండ్,పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని ఇవన్నీ మరిచి ఎన్నిక లు సమీపిస్తున్న తరుణంలో కొత్త నాటకాలకు తరలిపిన మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.అనంతరం పోలీసులు అరెస్టు చేసి గోదావరిఖని వన్ టౌన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సెక్రెటరీ కాలువ లింగస్వామి, బ్లాక్ వన్ అధ్యక్షుడు నగరబోయిన రవికుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్,బొమ్మక రాజేష్,యూత్ కాంగ్రెస్ నజీముద్దీన్, గౌతమ్, సతీష్, దూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!