గ్రామపంచాయతీ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపిన మక్కాన్సింగ్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 5: పాలకుర్తి మండలం గ్రామపంచాయతీ కార్మిక సంఘాల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు,రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సంఘీభావం తెలిరు.అనంతరం ఆయన మాట్లాడుతూ. గ్రామపంచాయతీ కార్మికులను బిఆర్ఎస్ పార్టీ చేసే పనికి ప్రభుత్వ గుర్తింపు,భద్రత లేని జీతాలు ఇస్తూ నాయకుల కన్ను సన్నాళ్లో వెట్టిచాకిరి,ఊడిగం చేయించుకుంటుందన్నారు.సమాన పనికి సమాన వేతనం,ఉద్యోగ భద్రత,మినిమం బేసిక్ ప్రైస్ రూ:19000/-చెల్లించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు రూ:15,600/-డ్రైవర్లు,కారోబార్లు,బిల్లు కలెక్టర్లకు రూ:15,500/- చెల్లించాలని జీవో నెంబర్ 51 నీ సవరించి మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దుపరిచి కార్మికులను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని నెల నెల జీతాలు ట్రెజరీ ద్వారా విడిపించే విధానాన్ని తీసుకురావాలని,ప్రమాద బీమా కల్పించాలని,లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామపంచాయతీ కార్మికులతో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు.గ్రామపంచాయతీ కార్మికుల తరఫున ప్రభుత్వ మెడలు వంచి డిమాండ్లను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచారు.లేనిపక్షంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.గ్రామపంచాయతీ కార్మికులంతా ఏకమై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాక్షస పాలన అంతమొందించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,గ్రామపంచాయతీ కార్మిక సంఘాల నాయకులు,కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!