ప్రజా ఆశీర్వాదయాత్రలో వర్షాన్ని లెక్కచేయని ఆశావాహులు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 19: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 5వ రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో బిఆర్ఎస్ పార్టీకి సింగరేణి కార్మికుల మద్దతు కూడగడుతున్న ఆశావాహులు. ఈరోజు యాత్రలో భాగంగా జీడీకే’టు’ఇంక్లైన్ మైన్ సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని కార్మికులకు తెలంగాణ రాష్ట్ర బొగ్గు గని సంఘం అండగా ఉంటుందని సమస్యలను అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.ప్రస్తుత దేశ,రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పడానికి కేసీఆర్ కృషి చేస్తుంటే రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అవినీతి పనులు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని ఆరోపించారు.గతంలో జాతీయ కార్మిక సంఘాలు,ఇతర పార్టీలు పోగొట్టిన ఎన్నో హక్కులను కేసీఆర్ అమలు చేసి ఇప్పటివరకు ఎన్నో డిమాండ్లను నెరవేర్చారని తెలియజేశారు. ఇదే ఆయనపై సింగరేణి కార్మికుల్లో అభిమానానికి కారణమైందని కార్మికులంతా బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. పార్టీని బ్రతికించుకోవాలంటే బిఆర్ఎస్ పార్టీ రాబోవు ఎన్నికలలో అభ్యర్థిని మార్చాల్సిందేనని వారు అధిష్టానాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిబిజికేఎస్ జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి,మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ,జడ్పిటిసి కందుల సంధ్యారాణి, మాజీ ఫ్లోర్ లీడర్,అసంఘటిత కార్మిక సంఘ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య,సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి,జనగామ శ్రీనివాస్,నూనె కొమరన్న,హరీష్,సాయి,వెంకటేష్,యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!