సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న రాజ్ ఠాకూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: సింగరేణి కార్మికుల ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ ఆర్జీ వన్ ఏరియాలోని ఓసిపి ఫైవ్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని,మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు.కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.రానున్న ఎన్నికలలో తనను గెలిపించి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు,ఎస్సీ సెల్,బీసీ సెల్,మైనారిటీ,మహిళ,యువజన కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ నాయకులతో పాటుగా సోషల్ మీడియా వారియర్స్,సింగరేణి కార్మికులు,కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!