సిపిఎం భూపోరాట కేంద్రం 1కి 41 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ గాదం సపోర్ట్
స్వేచ్ఛా న్యూస్, రామగుండం, మే 26: రామగుండం మున్సిపల్ కార్పొజీవరేషన్ లో సిపిఎం పార్టీ ఇల్లు లేని నిరుపేదల కోసం భూ పోరాటం చేస్తున్నటువంటి భూ పోరాట కేంద్రం 1 నుండి 41 డివిజన్ లో నివసిస్తున్నటువంటి ఇండ్లు లేని నిరుపేదలు మేము భూపోరాట కేంద్రం1లో గుడిసెలు వేసుకొని భూ పోరాటం చేస్తున్నామని గాదం విజయనందును మాకు అండగా నిలబడాలని వినతి పత్రం గత కొద్ది రోజుల క్రితం ఇవ్వగా వారు దానికి సానుకూలంగా స్పందిస్తూ నా కార్పొరేషన్ లోని ఇండ్లు లేని నిరుపేదలు ఇంటి స్థలాల కోసం గుడిసెలు వేసుకోవడానికి వారికి అండగా నిలబడినటువంటి సిపిఎం పార్టీకి కార్పొరేషన్ ప్రజలకు మద్దతు తెలిపారు. రెండు నెలల పైగా భూ పోరాటం చేస్తూ ఎండలో ఎండుతూ ఎన్నో బాధలకు ఓర్చుకుంటూ కనీస సౌకర్యాలు లేని ఆ స్థలంలో మహిళలు రోజంతా ఉంటూ ఇంటి స్థలాలకై పోరాటం చేస్తున్న వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వారికి ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 41 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గాదం విజయ నందు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ41 డివిజన్ ప్రెసిడెంట్ ఫజల్, జంజర్ల అజయ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సంపత్, యూత్ ప్రెసిడెంట్ శివ ఈ ప్రకటనలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!