బిఆర్ఎస్ అంటే భారత రైతు సమితన్న చందర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 13: గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోరికంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ మళ్లీ మీరు గెలిస్తే రామగుండం ప్రజలకు ఏం చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాదనుకున్న మెడికల్ కళాశాల,ఐటి,ఇండస్ట్రియల్ పార్క్,మాతంగి నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్న నాటి కాలం నుండి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం,సింగరేణి,ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి అసాధ్యమని ఆశలు వదిలేసుకున్న ఖూర్జ్ కమ్మి భూములకు పట్టాలు సాధించామన్నారు.రామగుండం నియోజకవర్గ ప్రజలు ఏమి కోరుకుంటారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా సౌకర్యాలు కలిగించడమే నా మేనిఫెస్టో అన్నారు.తాను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినంక గోదావరి నదికి కరకట్ట,టూరిజం స్పాట్ గా తీర్చిదిద్ది,తీగల వంతెన నిర్మాణం,నర్సింగ్ కళాశాల,మైనింగ్ పాలిటెక్నిక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్ర్ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు.శనివారం గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్ సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,కర్ణాటక మంత్రి శివకుమార్ మాటలతో తెలంగాణ రైతాంగం ఆందోళన చెందుతుందన్నారు.తెలంగాణలో సాగుకు 24 గంటల కరెంటు అవసరం లేదని మూడు గంటల కరెంటు సరిపోతుందని రైతులను బిచ్చగాళ్లతో పోల్చడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్ట చూస్తూన్నా కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టడానికి రైతాంగం సిద్ధంగా ఉందన్నారు.కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక సాగుకు విత్తనాలు,ఎరువులు దొరకక ఆకలి చావులు,ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి నీరందిస్తూ,సాగుకు ఏటా పదివేల రూపాయల రైతుబంధునిస్తూ 24 గంటల ఉచిత కరెంటు,సకాలంలో విత్తనాలు ఎరువులు అందిస్తూ పండించిన ప్రతి గింజను కొని రైతును రాజుగా చేసింది కెసిఆర్ పాలనలోని తెలంగాణ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి అని నిరూపించిందన్నారు.సభ రోజు కనీసం అమరవీరుల స్థూపానికి నివాళులైన అర్పించని నాటి సమైక్య పాలన ఉద్యమ ద్రోహులు ఉద్యమకారుడునైన నన్ను వ్యక్తిగతంగా బదనాం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.ఈ విలేకరుల సమావేశంలో నగర మేయర్ బింగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు,మాదాసు రామ్మూర్తి,తానిపర్తి గోపాలరావు,జేవి రాజు,అచ్చ వేణు,చల్లగుల మొగిలి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!