బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులపై చర్య తీసుకోవాలని దళిత బంధు లబ్ధిదారుల సమావేశం
స్వేచ్ఛ న్యూస్, జూలై 18, రామగుండం : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో దళిత బంధు లబ్ధిదారులు సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటుచేసుకొని రామగుండం నియోజకవర్గంలో గత రెండు మూడు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్న పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, కార్పొరేటర్ పాతిపెల్లి లక్ష్మి ఎల్లయ్య, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ,టీబీజీకేఎస్ జన్రల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి,బయ్యపు మనోహర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రామగుండం నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారులు ఈ సందర్భంగా కోరారు. బిఆర్ఎస్ పార్టీని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరికంటి చందర్ ను చులకన చేసి ఈ ప్రాంతంలోని ప్రతిపక్షలకు మేలు చేసే విధంగా ఈ ఈ ఐదుగురు నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలోని దళిత సంఘాల దళితులంతా ఎమ్మెల్యేకు మద్దతు ఇస్తున్న సందర్బంలో చందర్ నుఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారులు నీరటి శ్రీనివాస్,ఇరుగురాళ్ల శ్రావణ్,బాసంపల్లి శ్రీనివాస్,కొలుగూరి సాయికుమార్,లంకదాసరి హరికృష్ణ,ఓదేలు,కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!