పెద్దపెల్లి జిల్లాలోని నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 26: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో గల ఎమ్మార్పీఎస్ ఆఫీసు నందు జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా ఎం ఎస్ పి కోఆర్డినేటర్ మంథెన సాముయేల్ హాజరై ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం జరుగుతున్న ఉద్యమాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేయుటకు ఎమ్మార్పీఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పెద్దపెల్లి జిల్లాలోని వివిధ నియోజకవర్గలకు నూతన ఇన్చార్జిలను నియమించడం జరిగిందన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా స్థాయిలో జరిగే ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగస్వాములను చేసి చట్టబద్ధత సాధించేవరకు పోరాటాలు నిర్వహించాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన నియోజకవర్గ ఇన్చార్జీలుగా పెద్దపెల్లి అంబాల నరేష్ మాదిగ,రామగుండం నియోజకవర్గంలో గుండ్ల రాకేష్ మాదిగ,మంథని నియోజకవర్గం సింగారపు సుధాకర్ మాదిగలను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండ్ల మల్లికార్జున్,చొప్పరి మొగిలి, ఎం ఎస్ పి వడ్డేపల్లి దశరథం, పల్లె బాపు మాదిగ,ఎంఎస్పి కార్పొరేషన్ ఇంచార్జ్ అబ్దుల్ గని,ఎంఎస్పి కార్పొరేషన్ అధ్యక్షులు కాజీపేట రాజయ్య,గద్దల అనిల్ కుమార్, వేల్పురి రాంబాబు, అట్లూరి లింగస్వామి, ఖాన్ పెళ్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ మా నియమాకాలకు సహకరించిన ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులకు,మండల నాయకులకు,కార్పొరేషన్ ఇన్చార్జిలకు కృతజ్ఞతలు తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!