గుర్తుతెలియని వ్యక్తి మృతి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జూన్6: కాంపల్లి గంగయ్య అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు 27.4.2023 నాడు బెల్లంపల్లి కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరలో ఒక గుర్తు తెలియని వ్యక్తి స్పృహ లేని పరిస్థితిలో కింద పడి ఉండటంతో 108 కి ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈనెల 3.6.2023 రోజున అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని అనుకున్నాడు. కానీ మంగళవారం ఉదయం అనగా 6.6.2023 నాడు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మృతి చెందాడని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలపడంతో ఈ విషయాన్ని గంగయ్య బెల్లంపల్లి 2 టౌన్ స్టేషన్ కు సమాచారం అందించాడు. మృతుని వయసు సుమారు 50 నుండి 55 మధ్యవయసు కలిగి ఉండవచ్చని బట్టతల కలిగి ఉన్నాడు నల్ల పాయింటు ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కుసమాచారం అందించగలరని ఎస్ ఐ రవికుమార్ తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!