అర్హులకే దళిత బంధు ఇవ్వాలి: దినేష్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జూన్16: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలను లక్ష్యాలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యకర్తలకు పళ్లెంలో పలహారంగా పంచుతూ ఎమ్మెల్యేలు అర్హులకు అన్యాయం చేస్తున్నారని డి హెచ్ పి ఎస్ పెద్దపల్లి జిల్లా సమితి నాయకులు విమర్శించారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో దళిత హక్కు పోరాట సమితి రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు డి హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి రాజరత్నం సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఉపాధ్యక్షులు ఎర్రాల రాజయ్య,కోడెం స్వామి,కే.సదానందంలు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజరత్నం,మధ్ధెల దినేష్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులకు పథకాల ఎంపిక బాధ్యతలను అప్పగించి అర్హులకు అన్యాయం చేస్తూ అధికార పార్టీ అనుచరులకు వరంగా అందిస్తుందన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆరే అధికార పార్టీ శాసనసభ్యులు పర్సంటేజీలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మారని పరిస్థితులు దాకరించాయని పేర్కొన్నారు. దళిత బంధు ఇప్పటికే నియోజకవర్గానికి 100 చొప్పున ఇచ్చిన ఊరికో కోడి ఇంటికో ఈక లాగా ఉందని ఎద్దేవా చేశారు. దళిత బంధు ప్రభుత్వ పథకమా?రాజకీయ పథకమా? అని ప్రశ్నించారు. శాసనసభ్యులు మంత్రుల జోక్యం లేకుండానే కలెక్టర్ల ద్వారానే ఎంపిక చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 1500 చొప్పున కేటాయించినవి కలెక్టర్లకు అధికారం ఇచ్చి గ్రామసభలు,పట్టణ సభలు,డివిజన్ సభల ద్వారా ఎంపిక చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తిరని అన్యాయం జరిగిందన్నారు. కెసిఆర్ పాలనలో దళితులకు అడుగడుగున అన్యాయమే జరుగుతుందని దళితుల బడ్జెట్ ధనవంతులకు ఖర్చు చేస్తుందన్నారు. దళిత బందు పథకం అర్హులైన వారికే అందజేయాలని ప్రశ్నించిన వారి ఇండ్లపై దుర్మార్గమైన ప్రజాప్రతినిధులు దాడులు చేయిస్తూ,అక్రమ కేసులు పెట్టి వేధించడం వారి నియంత పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రభుత్వం దళిత బంధు పారదర్శకంగా అమలు చేయకపోతే ప్రగతి భవన్ వరకు దండయాత్ర చేపడతామని మధ్ధెల దినేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *