ఆరోగ్యం కోసం పరిసరాల పరిశుభ్రత అవసరం
నార్కట్ పల్లి, అక్టోబర్ 1, స్వేచ్ఛ న్యూస్:
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కామినేని వైద్య, విద్యా కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి సుధీర్ బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో, ప్రాథమిక పాఠశాల ఆవరణ లో, ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ కళాశాల వైద్య విద్యార్థులచే శ్రమదానం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య విద్యార్థులు గ్రామ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరమూ ఆరోగ్యం కోరుకుంటాం కానీ తమ వ్యక్తిగత పరిశుభ్రత తోనే సరిపెట్టుకుంటారు. పరిసర ప్రాంత అపరిశుభ్రత వల్ల సమాజంలో చెడు రుగ్మతలు పెరిగి ప్రతి ఒక్కరూ వ్యాధిగ్రస్తులుగా మారాల్సిన పరిస్థితి ఉంటుందనీ. ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని. తాను ఉండే ప్రాంతంలోనే తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలకు, ఇతర క్రిమి కీటకాలకు దూరంగా ఉండవచ్చని తద్వారా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్గా బాలకృష్ణ ,శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, ప్రొఫెసర్ డాక్టర్ బాలరాజు, కళాశాల సిబ్బంది ఓం ప్రకాష్, గోపాల్, నరేష్, దేవస్థాన సిబ్బంది శంకర్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!