ఇండస్ట్రియల్ పార్కుతో అంతర్గాంకు పూర్వ వైభవం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 3: అంతర్గాం మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతో అంతర్గాంకు పూర్వ వైభవం తీసుకురానున్నామని రామగుండం శాసనసభ్యులు కోరుకండి అన్నారు. ఈనెల 8వ తారీఖున రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బుధవారం రామగుండం శాసనసభ్యులు స్థల పరిశీలన చేశారు. అంతర్గాం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ రావడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి,రామగుండం నగర మేయర్ డాక్టర్,నడిపల్లి అభిషేక రావు,సర్పంచ్ వెంకటమ్మ నూకరాజు,నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్,నాయకులు కోలా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!