జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ అభినందనీయం
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 3: జనగణమన జాతీయ గీతం నిత్య గీతాలపన కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నార్కెట్ పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం కాసేపు మండల ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, జనగణమన ఉత్సవ సమితి సభ్యులు, కబడ్డీ ఆట ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసినట్లైతే వారి మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా ఆటలలో కూడా ప్రావీణ్యం పొందాలన్నారు. జనగణమన జాతీయ గీతాలపన కార్యక్రమం మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. సమితి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి నింపడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, పాశం శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక పావని శ్రీధర్, నాయకులు విష్ణుమూర్తి, వెంకట్ రెడ్డి, పాల్వాయి భాస్కరరావు, భీష్మాచారి, జనగణమన ఉత్సవ కమిటీ అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ, సభ్యులు నోముల నాగరాజు, శ్రీపతి గణేష్, గూడూరు అంజిరెడ్డి, నడింపల్లి చొక్కయ్య, జాల రమేష్, బండారు రమేష్, పల్లెర్ల నాగరాజు, బత్తిని రవి, పల్లెర్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!