సీఎం కేసీఆర్ కు కందుల సంధ్యారాణి కృతజ్ఞతలు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 6: ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ గురించి రైతుల స్పందన తెలుసుకోవడానికి పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి పాలకుర్తి మండలం లోని పొలాల్లో తిరుగుతూ రైతులతో ముచ్చటించి వారి స్పందనను తెలుసుకున్నారు. రైతులు వారి మాటల్లో తెలంగాణ రైతంగానికి ఎప్పుడు అండగా కేసీఆర్ ఉంటున్నారని రైతుబంధు,రైతు బీమా,ఉచిత కరెంటు లాంటి పథకాలను అందించి మా అభిమానాన్ని పొందారని ఇప్పుడు రైతు రుణమాఫీతో మా గుండెల్లో నిలిచారని ఆనందభాష్పాలతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మేము ఎప్పటికీ కెసిఆర్ కు రుణపడి ఉంటామన్నా వారి మాటలను విన్న కందుల సంధ్యారాణి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలపాలని కుక్కల గూడూర్ గ్రామంలో వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని వారి ఎడ్లబండ్లపై థాంక్స్ టూ కేసీఆర్ అంటూ ఫ్లకాడ్స్ తో కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రైతుల కష్టాలను అర్థం చేసుకొని ఇన్ని పథకాలను రైతుల కోసం రూపొందిస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా రైతుల పాలిట దేవుడని అభివర్ణించారు.గత ప్రభుత్వల హయాంలో ఎందరో రైతుల ఆత్మహత్యలు చూసామని ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి రైతు ముఖంలో ఆనందాన్ని చూస్తున్నామని అందుకే ప్రతి రైతు నినాదం నీవే మా అండ నీవే మా ముఖ్యమంత్రి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బోడకుంట సత్తయ్య,మేడం మల్లయ్య,కోడూరి సత్తయ్య,చింతకింది పోచయ్య,మేడం రాజయ్య,పత్తిపాక బుచ్చయ్య,కత్తెర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!