జర్నలిస్టుల గర్జన మహాసభకు రాజా రమేష్ మద్దతు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, జులై 23; డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 25వ తారీకున పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో జర్నలిస్టుల గర్జన సభకు రావాలని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాజా రమేష్ ను రావాలని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి రాజా రమేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సందర్భాలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేదా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తానని చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం చెప్పినట్లుగానే వారికి ఇంటి స్థలాలు కానీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ ఇవ్వాలని కోరారు లేనిపక్షంలో ముందు వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే వారి న్యాయమైన కోరికలు మేము తీరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి,ప్రధాన కార్యదర్శి తిరుపతిజిల్లా అధికార ప్రతినిధి,అనపర్తి కుమారస్వామి,,కోశాధికారి భక్తుల సతీష్, తదితర డి జె ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *