రామగుండం ప్రజలే నాకు సర్వస్వమన్నా కోరుకంటి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 9:రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటే చందర్ నామినేషన్ పర్వం సందర్భంగా తన ఇంట్లో తల్లి లక్ష్మీ గారి ఆశీర్వాదం తీసుకొని బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు,ప్రజలతో నామినేషన్ మహోత్సవానికి ర్యాలీగా బయలుదేరారు.గోదావరిఖని లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించిన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ నా జీవితం ప్రజలకే అంకితం ఇస్తున్నా నా చివరి శ్వాస ఉన్నంతవరకు రామగుండం ప్రజలకే సేవ చేస్తానని అన్నారు.2018 లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో నిలుచున్న తనకు సహాయ సహకారాలు అందించి సంపూర్ణ మద్దతు తెలిపి 26వేల మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంత ప్రజలు కష్ట కాలంలో నన్ను కడుపులో పెట్టుకొని సంజీవిని ఇచ్చి కాపాడారన వారి రుణం తీర్చుకోవడానికి రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలతో పాటు ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు.2014లో రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్న క్రమంలో ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తున్న తరుణంలో ఇక్కడి పరిస్థితులను వివరించి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి జిల్లా కేంద్రం కాకపోయినా రామగుండంకు మెడికల్ కళాశాలను తీసుకొచ్చాను అన్నారు. రామగుండం నియోజకవర్గం లోని కార్మిక,కర్షక సకల వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజాహితం కోసం ప్రతిక్షణం పనిచేశానన్నారు. కొడుకుల బిడ్డల భావించి నవంబర్ 30న జరిగే ఎన్నికలలో నాకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్,ఎన్నికల ఇంచార్జ్ నారదాసు లక్ష్మణరావు,నగర మేయర్ డాక్టర్ బింగి అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి,కౌశిక హరి,మండల ఎంపీపీ దుర్గం విజయ,కార్పొరేటర్లు నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!